ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ పౌరులంతా తమ డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా అకౌంట్ డీపీని మార్చలేదు. ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రొఫైల్ పిక్ మార్చలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే, మోదీ పిలుపుకు కౌంటర్‌గా నెహ్రు పట్టుకున్న జాతీయ జెండాను అందరూ డీపీగా పెట్టుకోవాలని కాంగ్రెస్ పిలుపిచ్చింది.