బెల్లం తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లంలోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ అయిన పొటాషియం, జింక్, సెలీనియంలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను అడ్డుకుని శరీరానికి ఇన్‌ఫెక్షన్లు తట్టుకునే శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియలో ఎంజైముల విడుదలలో బెల్లం చురుకైన పాత్ర పోషిస్తుంది. బెల్లం తీసుకుంటే రక్తహీనత, అజీర్తి సమస్యలు, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. టీలో బెల్లం కలుపుకుని తాగితే అద్భుత ఫలితాలుంటాయి.