ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేసినా తాము భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ కేసులతో తమను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈడీ దాడులు, విచారణల పేరిట ప్రతిపక్షాలను అణిచివేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని రాహుల్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa