అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలోని నక్షత్రాలు చూడటం సులభమయింది. తాజాగా దీని సాయంతో అంతరిక్షంలో అతి పెద్ద ‘చక్రం’ వంటి గెలాక్సీని నాసా శాస్త్రవేత్తలు కనుకొన్నారు. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో శాస్త్రవేత్తలు గుర్తించారు. విష్ణు చక్రంలా కనిపించే ఈ గెలాక్సీ కు కార్ట్ వీల్ అని పేరును పెట్టారు.