కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని, మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని లేఖలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అనేక అవకతవకలు ఉన్నాయన్నారు.