అనంతపురం జిల్లా ఉరవకొండలో టెన్త్ ఫెయిల్ అయిందని ఓ విద్యార్థిని కాలువలో దూకింది. వై.రాంపురం గ్రామానికి చెందిన ఎతీశ అనే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. మళ్లీ ఫెయిల్ కావడంతో తమ్ముడితో కలిసి కాలువ వద్దకు వెళ్లింది. తమ్ముడికి పట్టీలు, చెవి రింగులు ఇచ్చి కాలువలోకి దూకింది. గ్రామస్తులు కాలువలో వెతికినా ఆచూకీ లభించలేదు.