అందాల పోటీల్లో పాల్గొన్న తమిళనాడు పోలీసులపై బదిలీ వేటు పడింది. ఆదివారం మైలాడుతురై జిల్లా సెంబనార్కోవిల్లో ఒక ప్రైవేట్ సంస్థ అందాల పోటీ నిర్వహించింది. నటి యషికా ఆనంద్ పోటీలను ప్రారంభించారు. స్పెషల్ సీఐ సుబ్రమణియన్, మరో నలుగురు పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో పోలీసులు ర్యాంప్ వాక్ చేయడం మీడియాలో హైలైట్ అయింది. దీంతో నాగపట్నం ఎస్పీ జవగర్ వారిని గురువారం ట్రాన్స్ఫర్ చేశారు.