నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరీ మరణాన్ని వక్రీకరిస్తూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం తగదని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రికలు సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం అసత్య ప్రచారాలు చేసిన వైకాపా నాయకుడు దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఆదేశాలతో సీఐ సుధాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నాయకులు ఖాదర్ వలీ, సర్పంచి వాసు, మాజీ సర్పంచి జిలానీ, రెడ్డెయ్య, హాజీ మల్సూర్, ప్రభాకర్ పాల్గొన్నారు.