ఇటీవల చైనా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తైవాన్ ను ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమని పెలోసీ హెచ్చరించారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం చైనా తరం కాదని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న పెలోసీ మీడియాతో మాట్లాడారు.