తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య వ్యవహారంపై చర్చపోచర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఉమా మహేశ్వరి ఉరేసుకున్న కారణంగానే మృతి చెందిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఉమా మహేశ్వరి మృత దేహానికి శవ పరీక్ష నిర్వహించిన ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదికను నేడు జూబ్లీ హిల్స్ పోలీసులకు అందజేశారు. ఉరేసుకున్న కారణంగా ఉమా మహేశ్వరి మెడ భాగంలో స్వరపేటిక విరిగిందని, ఈ కారణంగానే ఆమె మరణిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.