ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. విజయవాడ విజిలెన్స్ సీఐ సహెరా బేగం అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాలో జరిగే అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం లభించింది. మహిళలపై దాడులు-హింస అంశంపై ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 2 వరకు అమెరికాలో సదస్సులు నిర్వహించనున్నారు.
మహిళల పట్ల పురుషుల బాధ్యత, మహిళలపై అకృత్యాలు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనాలంటూ సీఐ సహెరా బేగంకు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. కాగా, ఈ సదస్సులకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ దేశాల్లో మహిళల పరిస్థితిపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa