ప్రియుడితో పట్టుబడిన మహిళపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన యూపీలోని మాధవ్పుర్ పురైనా ప్రాంతంలో జరిగింది. సిద్ధార్థనగర్‌కు చెందిన ఓ మహిళ భర్త ఉపాధి నిమిత్తం రాజస్థాన్ వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన యువకుడితో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఇటీవల ప్రియుడితో ఇంటికి వెళ్లిన ఆమెను గ్రామస్తులు స్తంభానికి కట్టి కొట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.