ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.ఉత్తరాంధ్రలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇతర చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రేపు ఎల్లుండి రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అని తెలిపారు.