శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఈఓఎస్-02, అజాదిశాట్ ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో కాకుండా అస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో తాజాగా కనుగొంది. నేటి రాకెట్ ప్రయోగం విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ఈ ఉపగ్రహాలు ఉపయోగపడవని ఇస్రో స్పష్టం చేసింది.ఓవరాల్ గా నేటి ప్రయోగం అంచనాలను అందుకోలేదని తేలింది. సెన్సార్ సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని ఇస్రో తెలిపింది. అందుకే ఉపగ్రహాలు తప్పు కక్ష్యలోకి ప్రవేశించాయి. ఇస్రో కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.