ఐదో టీ20 మ్యాచ్ ఫ్లోరిడాలోని లాడర్డేల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో 88 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ 100 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు.