నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోదీ వ్యవసాయం సహా మరిన్ని కీలక అంశాలపై మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగాలని ఆశించారు. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని సూచించారు. భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్న మోడీ.. 2023లో జరిగే జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తుందని వెల్లడించారు.