మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు సహజ యాంటాసిడ్‌గా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతి నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలం మరియు చలికాలంలో నానబెట్టిన మెంతి నీటిని తాగడం మంచిది.