మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని కజ్లీ గ్రామంలోని విస్మయకర ఘటన జరిగింది. దీప్‌చంద్ అనే వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడుతుంటాడు. మహిళల ముందు తరచూ దుస్తులు విప్పి చూపించేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా వినకపోవడంతో గ్రామస్తులలో కోపం కట్టలు తెంచుకుంది. ఇద్దరు గ్రామస్తులు ఆదివారం పెట్రోల్ తెచ్చి, అతడి ప్రైవేట్ పార్ట్స్‌పై పోసి నిప్పటించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.