బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన క్రీడాకారులు అదృశ్యమయ్యారు. వారు పాల్గొనే పోటీలు ముగియగానే తప్పించుకున్నట్లు శ్రీలంక అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ఉండిపోయేందుకే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 160 మంది క్రీడాకారులలో ఏడుగురు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.