తొలిసారి అమెరికా యుద్ధ నౌక రిపేర్ కోసం భారత్‌కు వచ్చింది. ఆదివారం అమెరికా నౌకా దళానికి చెందిన చార్లెస్ డ్రూ తమిళనాడుకు చేరుకుంది. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉన్న లార్సెన్ & టూబ్రో షిప్‌యార్డ్‌లో ఆ షిప్‌కు రిపేర్, నిర్వాహణ పనులు చేపడతారు. కాగా, 'మేక్ ఇన్ ఇండియా'కు భారీ ప్రోత్సాహమని రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త కోణమని పేర్కొంది.