కరోనా బారిన పడి చికిత్స కోసం ఒక సంస్థ లేదా ఇతర వ్యక్తుల నుంచి సాయం అందుకుంటే దానిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు, ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను 'కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' ఇటీవల విడుదల చేసింది. ఆ పత్రాలను ఆదాయపు పన్ను విభాగానికి అందించి పన్ను మినహాయింపు పొందవచ్చు.