పశ్చిమగోదావరి జిల్లాలో ఓవైసీపీ అభిమాని మనోవేధనను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక వివరాలలోకి వెళ్లితే.. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వైసీపీ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు. బైక్ విషయంలో పోలీసుల యువకుడ్ని ఇబ్బంది పెట్టారని.. వెంటనే ఉన్నతాధికారులకు సమస్యను చెప్పి ఫిర్యాదు చేశారు. అతడి ఒంటిపై ఉన్న పచ్చబొట్లను చూసి చింతమనేని ఆశ్చర్యపోయారు. చింతలపూడి రోడ్డులో జరిగిన ఘటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. టీడీపీ ట్వీట్ చేసింది.
చింతలపూడి రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేవని కొన్ని బైకుల్ని సీజ్ చేశారు. ఓ యువకుడి బైక్‌కు ఇన్స్యూరెన్స్ లేదని స్వాధీనం చేసుకున్నారు. తాను అత్యవసరమై ఆస్పత్రికి వెళుతున్నాని.. ఇన్స్యూరెన్స్ లేదు కాబట్టి జరిమానా విధించమని కోరాడు. కానీ పోలీసులు మాత్రం డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత బైక్ అప్పగిస్తామన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది.
అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అటు వైపుగా వెళ్లారు. ఆ యువకుడికి అండగా నిలిచారు. అత్యవసరమై వెళుతుంటే బైక్ స్వాధీనం చేసుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. అతడికి జరిమానా విధించి బైక్ తిరిగి ఇవ్వాలని కోరారు. అవసరమైతే ఆ ఫైన్ తాను చెల్లిస్తానని చెప్పారు. సాయంత్రం వరకు బైక్ ఇవ్వనని చెబితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్సైతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
బైక్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోతే జరిమానా విధించాలి కానీ ఇలా బైక్‌లు స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. ఆ యువకుడ్ని సాయంత్రం 4 గంటలకు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. అవసరమైతే తాను రోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఆ యువకుడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడని తెలిసి.. అతడి ఒంటిపై పచ్చబొట్లు చూసి చింతమనేని ఆశ్చర్యపోయారు.
ఆ యువకుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని వైఎస్సార్‌సీపీపై అభిమానంతో పచ్చబొట్లు ఒంటిపై వేయించుకున్నట్లు చెప్పాడు. ఇంత అభిమాని కదా.. ఎందుకు జగన్‌ను తిడుతున్నావని యువకుడ్ని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు సరిగా లేదని.. రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. నరకం చూపిస్తున్నారని.. జీవితంలో ఇంకోసారి ఓటు వేయనన్నాడు. ‘కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త తన శరీరం అంతా పచ్చబొట్టుతో వైసీపీ, జగన్ పేర్లు రాసుకున్నాడు, జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి ఇంకా జీవితంలో వైసీపీ పార్టీకి ఓటు వెయ్యను అంటున్నాడు’అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేసింది.