ఒక ఇంట్లోని వ్యక్తులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చూసుంటాం. కానీ కేరళ మలప్పురమ్ లో ఒకేసారి తల్లీకొడుకులు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ళ బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పరీక్షలో 92వ ర్యాంకు, కుమారుడు(24) లోయర్ డివిజనల్ క్లర్క్ పరీక్షలో 38వ ర్యాంకు పొందారు. కొడుకును ప్రోత్సహించడానికి చదవడం మొదలుపెట్టి, ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.