రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని మహారాణి కళాశాలలో చేరిన ముగ్గురు విద్యార్థినులు సోమవారం ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ముందు కళాశాల ఆవరణలో ఏటీఎం, బ్యాంకు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ రేగింది. వారి డిమాండ్లను పరిశీలిస్తామని కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో బాలికలు దిగివచ్చినట్లు పోలీసులు తెలిపారు.