పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆస్పత్రిపాలయ్యాడు. కొంతకాలంగా ఆయనకు మోకాలుకు సంబంధించిన ఇబ్బంది ఉంది. మోకాలి గాయంతో షోయబ్ అక్తర్ బాధపడుతుండటంతో ఇటీవలె శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. తనకు ఇలా జరగడంపై ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసి అక్తర్ భావోద్వేగానికి గురయ్యాడు. మోకాలి గాయం కారణంగా తన కెరీర్ చాలా త్వరగా ముగిసిందని, అందుకే రిటైర్డ్ అయినట్లు తెలిపాడు.