ఉక్రెయిన్ యుద్ధం క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకొన్నప్పుడే మొదలైందని, క్రిమియా విముక్తితోనే యుద్ధం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తేల్చిచెప్పారు. క్రిమియా ఎప్పటికీ ఉక్రెయిన్లోని భాగమేనని స్పష్టం చేశారు. డానిని వదిలిపెట్టబోమని తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి క్రిమియా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. మరోవైపు అదే సమయంలో రష్యా వాయుసేన స్థావరంలో ఉక్రెయిన్ దాడులు చేపట్టింది.