అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం.. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట మండలం తడిగిరిలో అరిసెల రాధిక అనే మహిళ.. మంగళవారం సాయంత్రం తన నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి ఉరి వేసుకుంది.
పొలం పనుల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇది చూసి నిర్ఘాంతపోయాడు. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. తల్లి రాధికకు కొన్ని రోజులుగా మానసికస్థితి సరిగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.