యడ్లపాడు: తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య, ఆరోగ్యం అందిస్తే చాలని ఆస్తిపాస్తులు కాదని స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బందెల ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలో బుధవారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కథల పుస్తకాలను పంపిణీ చేశారు. చిన్నారులకు కేవలం విద్యకు సంబంధించిన అంశాలనే కాకుండా ఇతర రంగాలపై కూడా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరుణకుమారి పాల్గొన్నారు.