గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఢిల్లీలో ఈ ఏడాది 6 నెలల్లో ఆడవారిపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపుల కేసులు పెరిగాయి. ఢిల్లీలో 2022లో మొదటి 6 నెలల్లో 1100 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1480 మహిళా వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2197 మహిళా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఢిల్లీలో మహిళలపై గృహ హింస 29 శాతం పెరిగింది. అయితే, చాలా సందర్భాల్లో మహిళలకు తెలిసిన వారే నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.