లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఇటీవల టీడీపీ ఫిర్యాదు చేయగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఫిర్యాదు చేశారు. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్లకు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు జస్బీర్ సింగ్ గిల్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వ్యవహారం పార్లమెంటు సభ్యులకు మాయని మచ్చగా ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ వీడియోపై తక్షణమే దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో ప్రధాని, స్పీకర్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్లను కోరారు.