టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ పేసర్ బుమ్రా ఇంకా కోలుకోలేదు. ఆస్ట్రేలియాలో మ్యాచులు అంటేనే పేసర్లకు స్వర్గధామం. అలాంటిది బుమ్రా ఇంకా కోలుకోకపోవడం బీసీసీఐ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పేసర్లలో బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, షమీ కీలకంగా కనిపిస్తున్నారు.