పంజాబ్ లోని మొహాలీకి చెందిన పూనమ్ చదువుకోవడం కోసం పానీపూరీ అమ్ముతోంది. ఆమె చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆమె తల్లి ఫుడ్ స్టాల్ను నిర్వహిస్తూ నలుగురు పిల్లల్ని పోషిస్తోంది. ఇంట్లో తానే పెద్దదాన్ని అని, ఇంటర్ వరకు చిన్న జాబ్ చేస్తూ చదువుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆర్థిక సమస్యలతో చదువు ఆగిపోవడంతో పానీపూరీ స్టాల్ పెట్టానని చెప్పింది. సాయంత్రం పనిచేస్తూ డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది.