ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఉన్న కాసా డాన్జా క్లబ్ కు బుధవారం నలుగురు మహిళలు, తమ స్నేహితుడితో కలిసి వచ్చారు. అక్కడున్న ఓ బౌన్సర్ వారిలోని ఒక యువతిని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు బౌన్సర్ లు యువతులను బయటకు తోసేశారు. అడ్డుకున్న బాయ్ ఫ్రెండ్ ను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. యువతులు వద్దని వారించిన, కనికరం చూపలేదు.