నిత్యం మనం చేసే ఏ పనిలోనైనా ఏకాగ్రత లోపిస్తే పనిలో నాణ్యత తగ్గడంతో పాటు విజయం సాధించలేమన్న సంగతి తెలిసిందే. అందుకే ఏకాగ్రత పెంచుకోవడం కోసం నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు. బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్(సుడోకు, చదరంగం) ఆడటం, 7- 8 గంటల నిద్రపోవడం, పార్క్ లేదా మీ గార్డెన్‌లో సమయం గడపడం, వంట చేయడం లాంటి పనుల వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం, వ్యాయామం నుంచి మంచి ఫలితాలను పొందవచ్చు.