సముద్రంలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో చోటు చేసుకొంది. జంట మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేగింది. రుషికొండ సముద్ర తీరానికి నిన్న ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఈ తెల్లవారుజామున యువతి డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... వీరిద్దరి మృతి వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. వీరి మరణాల వెనుక ఏ కారణాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa