తప్పులైతే గత ప్రభుత్వాలపై నెట్టడం, ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయింది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ వాపోయారు.
ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే మీద స్పందిస్తూ..... ఏపీ ముందుండటం వైసీపీ ప్రభుత్వ ఘనతే అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిగ్గులేకుండా అబద్దాలు ఆడుతున్నారు.
ఈ సర్వే 1 ఏప్రిల్ 2018 నుంచి 31 మార్చి 2019 వరకు విద్యార్థుల ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాలు ఆధారంగా ఈ సర్వే నివేదిక ఇచ్చింది. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో దేశంలో 3.04 శాతం ఉంటే ఏపీలో 8. 64 శాతం ఉందంటే ఇది పెరగడానికి కారణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రాపవుట్స్ ని తగ్గించేందుకు 2000వ సంవత్సరంలోనే మళ్లీ బడికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం.
ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఏపీకి వచ్చిన మెరుగైన ఫలితాల్లో 0 శాతం కూడా జగన్ రెడ్డి క్రెడిట్ లేదు. జగన్ రెడ్డి ఇకనైనా ఇతరుల ఘనతని తనది చెప్పుకోవటం అనే వ్యసనం నుంచి బయటపడాలి అని హితవు పలికారు.