ఆసియా కప్‌లో భాగంగా పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే వీరు తలపడతారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా మారింది. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ క్రేజ్‌ని ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో ప్రతి టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ ఫార్ములాను అనుసరించింది. ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు.. దాంతో ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే సందడి నెలకొంది.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇరు జట్లకు పలు సూచనలు చేస్తూ తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రముఖ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా తన జోస్యం చెప్పాడు. పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు.