పెద్దతిప్పసముద్రంలోని దివ్యాంగులకు బ్యాంకుల ద్వారా మంజూరయ్యే స్వయం ఉపాధి రుణాల కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని వికలాంగ జేఏసి జిల్లా అధ్యక్షుడు సురేంద్ర శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 100 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు. ఒక్కొక్కరికి 10వేల నుంచి 5 లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు.