ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బాధ్యతగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను కట్టాలని సోమల మండల ఎంపీపీ ఈశ్వరయ్య, ప్రిన్సిపాల్ గంగాధర్ నాయుడులు పేర్కొన్నారు. శనివారం కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసి అనంతరం ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు విద్యార్థులు, పోలీసులు కళాశాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్సై షామీర్ భాష, ప్రతినిధులు సయ్యద్ బాషా, రమణ మోహన్ పాల్గొన్నారు.