ఎర్రావారిపాళెం మండలంలోని కోటకాడపల్లి అటవీసరిహద్దులో శనివారంసాయంత్రం హెలికాప్టర్ కూలిందని ప్రచారం జరిగింది. సాయంత్రం 4గంటల సమయంలో కోటకాడపల్లి సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. క్షణాల్లోనే కనిపించకుండా పోయింది. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు రావడంతో హెలికాప్టర్ కూలిందని గ్రామస్తులుహడావుడి చేశారు. పొగలు వస్తున్న ప్రదేశానికి వెళ్లి చూడగా ఓ రైతు పొలంలో చెత్తకు నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa