చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో మండలంలోని పలు ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగిరేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |