గుంటూరు, తాడికొండ: మండలంలో ఆదివారం విద్యుత్ కోత విధించనునట్లు విద్యుత్ శాఖ ఏ.ఈ.ఈ రవి కుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కావున, విద్యుత్ వినియోగదారులంతా ఈ విషయాన్ని గమనించి అధికారులకి సహకరించాలని ఆయన కోరారు.