గుంటూరు, మాచర్ల: మాచర్ల స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 330 కేసులు పరిష్కారమైనట్లు మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షులు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు తెలిపారు. సివిల్ కేసులు 27, క్రిమినల్ 47, భరణం 4, ఎన్ఐ యాక్ట్ 2, ఇతర కేసులు 224, లిటికేషన్ 6 కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.