గోడలో దొరికిన ఆ లాకర తెరిచి చూసి అంతా షాక్ అయ్యారు..అందులో ఉన్నవాటిని చూసి అందరూ అవాక్కయ్యారు. విజయనగరం జిల్లా రాజాంలోని కంచర వీధిలో ఓ పాత ఇంటిని కూలగొడుతుండగా, గోడలో ఓ ఇనుప లాకర్ లభ్యం కావడం తెలిసిందే. ఆ లాకర్ మాకు చెందుతుందంటే మాకు చెందుతుందంటూ యజమాని, కూలీల మధ్య వాగ్వాదం చెలరేగగా, పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి ఆ లాకర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకర్ లో గుప్త నిధులు ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. తాజాగా పోలీసుల సమక్షంలో ఆ లాకర్ ను తెరవగా, అందరూ ఆశ్చర్యపోయారు. అందులో చిన్న నాణేలు తప్ప మరే విలువైన వస్తువులు లేవు. ఏవో కొన్ని పాత కాగితాలు లభ్యమయ్యాయి. ఆ లాకర్ లో నిధినిక్షేపాలు ఉంటాయోమో చూద్దామని వచ్చిన జనం నిరాశకు లోనయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa