గుమ్మడి కాయలో విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, మెగ్నీషియం, సోడియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మంచి పోషకాహారం. ఇది రక్తంలోని మలినాలను బయటకు పంపుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.గుమ్మడి కాయ వల్ల బీపీని నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడి కాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.