దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడిన వారిలో 32 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,17,508కు చేరింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక ఆదివారం దేశవ్యాప్తంగా 25,50,276 మంది వ్యాక్సిన్లు పొందారు.