విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఆగస్టు 23న విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచి 2022 సంవత్సరం నూతన మెస్ చార్జీల పట్టికను తక్షణమే అమలు చేయాలన్నారు.