బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రుషి సునక్ తాజాగా ఆ రేసులో కాస్త వెనకబడ్డారు. బ్రిటన్ ప్రధాని ఎవరన్నది సెప్టెంబరు 5న తేలనుంది. ప్రధానంగా కన్జర్వేటివ్ పార్టీ నేతలు లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉంది. ఇరువురి మధ్య విజయావకాశాలు దోబూచులాడుతున్నాయి. ఇటీవల ప్రధాని రేసులో పుంజుకున్న భారత సంతతి నేత రిషి సునాక్ మళ్లీ వెనుకబడిపోయారు. ఓ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కు 61 శాతం మంది మద్దతు పలకగా, రిషి సునాక్ కేవలం 39 శాతం మంది మద్దతు సంపాదించగలిగారు. ఈ సర్వేలో 570 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. 22 అంశాల ప్రాతిపదికన ఈ సర్వే చేపట్టారు. ఇదిలావుంటే కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవుతారని తెలిసిందే. కన్జర్వేటివ్ నేతను ఎన్నుకునేందుకు తుది గడువు సెప్టెంబరు 2. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ సభ్యులు పోస్టల్, ఆన్ లైన్ పద్దతిలో ఓటింగ్ లో పాల్గొననున్నారు.