మంగళగిరి: నవ్య నగరంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏకంగా నగరపాలక సంస్థకు చెందిన పలు స్థలాల్లో సైతం అక్రమ కట్టడాలు కడుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని నగరవాసులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. నగరంలోని అక్రమ కట్టడాలను అరికట్టాలని, నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.