చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది.ఈ గూఢచారి నౌక రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్దిరోజుల్లోనే శ్రీలంకలోని పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నౌకకు ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని రక్షణ శాఖ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa